![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -288 లో.....అసలు డాడ్ ఇంకా రాలేదేంటి? ఆ దాస్ గాడు నిజం చెప్పి ఉంటాడా.. నా చెవి కమ్మ ఎక్కడ పోయినట్లు.. కార్ లో కూడ లేదని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇప్పుడు నేను ఆ కాశీ ఇంటికి వెళ్ళాలంటూ జ్యోత్స్న కంగారుగా బయలుదేర్తుంటే అప్పుడే దశరథ్ వస్తాడు. ఏంటి కంగారు పడుతున్నావని జ్యోత్స్నని దశరథ్ తో అడుగగా.. ఎక్కడికి వెళ్ళావ్ డాడ్ అని జ్యోత్స్న అడుగుతుంది. నేను ఎక్కడికి వెళ్లానో నీకు తెలియదా అని దశరథ్ అంటాడు.
ఈ చెవి కమ్మ నీదేనా అని దశరథ్ చూపించగానే.. నీకు ఎక్కడ దొరికిందని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు ఎక్కడ పారేసుకున్నావో అక్కడ దొరికిందని దశరథ్ చెప్తాడు. డాడ్ కి నిజం చెప్పేసాడా అందుకే ఇలా మాట్లాడుతున్నాడా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. అప్పుడే పారిజాతం వస్తుంది. ఎక్కడికి వెళ్ళావని దశరథ్ ని అడుగుతుంది. దాస్ దగ్గరికి అని దశరథ్ చెప్పగానే.. ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడని పారిజాతం అడుగుతుంది. బాగున్నాడు ఏదో చెప్పాలని ట్రై చేసాడు. కిటికీ దగ్గర ఎవరో శబ్దం చేశారు. మళ్ళీ అంత మర్చిపోయాడని జ్యోత్స్నని ఉద్దేశించి దశరథ్ అంటాడు. అంటే దాస్ నిజం చెప్పలేదన్నమాట అని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. డాడ్ కి నాపై డౌట్ వచ్చింది కానీ దాస్ చెప్పాక కన్ఫమ్ చేసుకోవాలనుకుంటున్నాడని జ్యోత్స్న అనుకుటుంది. ఆ తర్వాత కుబేర్ ఫోటోకి దీప మొక్కుకుంటుంది. అది చూసిన అనసూయ.. నా తమ్ముడు నీ తండ్రి కాదు.. ఆ విషయం నాకు, నా తమ్ముడికి ఆ దాస్ కి తెలుసు. నీ కన్నతల్లితండ్రలు ఎవరో దాస్ కనుక్కుంటానన్నాడని అనసూయ తన మనసులో అనుకుటుంది.
ఆ తర్వాత కావేరిని శివన్నారాయణ ఇంటికి తీసుకొని వస్తాడు శ్రీధర్. ఎందుకు వచ్చావంటూ శివన్నారాయణ శ్రీధర్ ని అవమానిస్తాడు. నాకు మంచి, మానవత్వం లేదన్నావ్ కదా.. ఇదిగో నేను శౌర్య ఆపరేషన్ కి డబ్బు ఇచ్చానంటూ కార్తీక్ రాసిచ్చిన నోట్ చూపిస్తాడు. మావయ్య ఆ రోజు అడిగితే సాయం చెయ్యలేదన్నావని జ్యోత్స్న అడుగుతుంది. చేసిన సాయం చెప్పుకునే అలవాటు లేదని శ్రీధర్ అంటాడు. అయిన ఈ నోట్ లో నీ రెండవ భార్య అప్పు ఇచ్చినట్లు ఉందని జ్యోత్స్న అంటుంది. ఎవరిస్తే ఏంటి? ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళండి అంటూ శివన్నారాయణ చెప్పి వెళ్ళిపోతాడు. అందరు వెళ్ళిపోయాక కావేరికి సుమిత్ర థాంక్స్ చెప్తుంది. దీపకి నేను చేయాల్సిన సాయం నువ్వు చేసావ్ వదిన అని సుమిత్ర అనగానే.. ప్రేమగా పిల్చావంటూ కావేరి హ్యాపీగా ఫీలవుతుంది. మావయ్య గారు చూస్తే కోప్పడతారు.. తర్వాత మాట్లాడుకుందామని కావేరీతో సుమిత్ర అంటుంది. దాంతో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |